శ్రీ శారదా స్తుతి శతకం
స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
సూక్తిమయమహితముక్తా
శుకింజగదార్తివంచనా సక్తిం
శక్తివిరించనీయం
ముక్తి ప్రసాద వర్తినీ సేవే !! 21
ఓ తల్లీ ! సూక్తులనే ముత్యాలు నీదగ్గరున్నాయి.జగత్తులోని జనులబాధలను తొలగించే ఆసక్తి నీలో ఉంది.అటువంటి విరించి శక్తి రూపిణివైన నీవు నాకు ముక్తిని ప్రసాదించు.నిన్ను సదాసేవిస్తాను.
మందా క్షాంచిత విభ్రమ
మంజూషేరత్నఖచితగలభూషే !
మందగతే ! గానరతే !
మమ భవక్రామ ప్రదాయినీ వాణీ !!22
ఓ వాణీ ! కారుణ్యంచే మందమైన చూపులుగల నీ కంఠంలో రత్న ఖచిత మాలిక విరాజిల్లుతున్నది.మందగతితో సాగే గానలోలుపా ! నా అభీష్టాలను సిద్ధింపజేయు తల్లీ !
మందస్మిత రదనచ్ఛద
మధుర దృశాదీత్తి సంగమగ్వ ! తవ !
మన్యే ముక్తా విద్గుమ
మధవ మణికాంతి సంగతిం వాణీ !! 23
ఓ తల్లీ ! చిరునవ్వులతో విప్పారిన నీ పెదవులపై నీ కటాక్షాల కాంతి ప్రతిఫలిస్తుంటే,ఆ శోభ ముత్యాలూ,విదృమాలూ,మణులూ ఒక చోట చేరినట్లు కనబడుతున్నది.
బాధాకర్యై విపదా
మాధారాజాండ కోటయేకుర్వే !
మేఘా కృతయే వినితం
గాధాయై శతధృతేర్విచిత్రాయై !! 24
ఓ తల్లీ ! నీవు ఆపదలకు బాధ కలిగిస్తావు.బ్రహ్మదేవునికి ఆధారమైయున్నావు .అతని విజయగాధవై అలరారుతున్న మేధావర్ధినీ ! నిన్ను వేడుతున్నాను.
పద్యాయాం విలసంత్యన
వద్యాయా మాగమాంత విపినస్య !
విద్యామయీ ప్రసన్నా
దద్యాన్మే శారదా తులామ్మేధాం !! 25
ఓ తల్లీ ! నీవు విద్యా మయివై అనేక శాస్త్ర విద్యలలో ప్రకాశిస్తావు.అలాంటి నీవు నా పట్ల ప్రసన్నురాలవై నిరుపమాన మేధాశక్తిని నాకు ప్రసాదించు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿ ಶತಕಂ
ಸ್ತುತಿ ಕರ್ತಾ
ಅಭಿನವ ಕಾಳಿದಾಸಃ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರೀ
ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಾತಾ :
ಶ್ರೀ ಕೇ .ಯನ್ .ಸೂರ್ಯನಾರಾಯಣ
ಟಿ.ಜಿ.ಟಿ (ಸಂಸ್ಕೃತಂ)
ಕೇಂದ್ರೀಯ ವಿದ್ಯಾಲಯ
ಮಲ್ಲೇಶ್ವರಂ ,ಬೆಂಗಳೂರು -೫೬೦೦೫೫
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ಸೂಕ್ತಿಮಯಮಹಿತಮುಕ್ತಾ
ಶುಕಿಂಜಗದಾರ್ತಿವಂಚನಾ ಸಕ್ತಿಂ
ಶಕ್ತಿವಿರಿಂಚನೀಯಂ
ಮುಕ್ತಿ ಪ್ರಸಾದ ವರ್ತಿನೀ ಸೇವೇ || 21
ಓ ತಾಯಿ! ಸೂಕ್ತಿಗಳೆಂಬ ಮುತ್ತು ನಿನ್ನಲ್ಲಿವೆ. ಜಗತ್ತಿನ ಜನರ ಕಷ್ಟಗಳನ್ನು ಪರಿಹರಿಸುವ ಆಸಕ್ತಿ ನಿನ್ನಲ್ಲಿದೆ. ಇಂಥಹ ಬ್ರಹ್ಮಶಕ್ತಿಹೊಂದಿರುವ ನೀನು ಮುಕ್ತಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸು. ನಿನ್ನನ್ನು ಸದಾ ಸೇವಿಸುವೆ.
ಮಂದಾಕ್ಷಾಂಚಿತವಿಭ್ರಮ
ಮಂಜೂಷೇರತ್ನಖಚಿತಗಲಭೂಷೇ !
ಮಂದಗತೇ ! ಗಾನರತೇ !
ಮಮ ಭವಕ್ರಾಮ ಪ್ರದಾಯಿನೀ ವಾಣೀ ||22
ಓ ವಾಣಿ! ಕಾರುಣ್ಯದಿಂದ ಕೂಡಿದ ನೋಟ ದೊಂದಿಗೆ ನಿನ್ನಕಂಠದಲ್ಲಿನ ರತ್ನಖಚಿತ ಮಾಲೆ ವಿರಾಜಿಸುತ್ತಿದೆ. ಮಂದಗತಿಯಲ್ಲಿನ ಗಾನದಲ್ಲಿ ನಿರತಳಾದವಳೆ! ನನ್ನ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಪೂರೈಸು ತಾಯಿ.
ಮಂದಸ್ಮಿತ ರದನಚ್ಛದ
ಮಧುರ ದೃಶಾದೀತ್ತಿ ಸಂಗಮಗ್ವ ! ತವ !
ಮನ್ಯೇ ಮುಕ್ತಾ ವಿದ್ಗುಮ
ಮಧವ ಮಣಿಕಾಂತಿ ಸಂಗತಿಂ ವಾಣೀ || 23
ಓ ತಾಯಿ! ನೀನು ಮುಗುಳುನಕ್ಕಾಗ ತುಟಿಗಳಿಂದ ನಿನ್ನ ಕೃಪಾದೃಷ್ಟಿಯ ಕಾಂತಿಯು ಹೊರಹೊಮ್ಮುವುದು. ಆ ಮಧುರಕಾಂತಿಯು, ಮುತ್ತು ಹವಳಗಳಕಾಂತಿ ಒಂದೆಡೆ ಸೇರಿದಂತೆ ಕಾಣಬರುವುದು.
ಬಾಧಾಕರ್ಯೈ ವಿಪದಾ
ಮಾಧಾರಾಜಾಂಡ ಕೋಟಯೇ ಕುರ್ವೇ !
ಮೇಘಾ ಕೃತಯೇ ವಿನಿತಂ
ಗಾಧಾಯೈ ಶತಧೃತೇರ್ವಿಚಿತ್ರಾಯೈ || 24
ಓ ತಾಯಿ! ಆಪತ್ತುಗಳಿಗೆ ಬಾಧೆಯನ್ನು ಉಂಟುಮಾಡಬಲ್ಲೆ ನೀನು. ಬಹ್ಮದೇವನಿಗೆ ಆಧಾರ ನೀನು. ಶತಧೃತುವಿನ (ಬ್ರಹ್ಮನ) ವಿಜಯದ ರಹಸ್ಯ ನೀನು. ಅಂಥಹ ಮೇಧಾವರ್ಧಿನಿಯೇ, ನಿನ್ನನ್ನು ನಮಸ್ಕರಿಸುತ್ತೇನೆ.
ಪದ್ಯಾಯಾಂ ವಿಪಲಸಂತ್ಯನ
ವದ್ಯಾಯಾ ಮಾಗಮಾಂತ ವಿಪಿನಸ್ಯ !
ವಿದ್ಯಾಮಯೀ ಪ್ರಸನ್ನಾ
ದದ್ಯಾನ್ಮೇ ಶಾರದಾ ತುಲಾಮ್ಮೇಧಾಂ || 25
ಓ ತಾಯಿ! ನೀನು ವಿದ್ಯಾಮಯಿ. ಕಾವ್ಯದಲ್ಲಿ ಪದವಿಲಾಸಿನಯಾಗಿ ನಿಗಮ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಜ್ಞಾನದ ನಿಧಿಯಾಗಿ ವಿರಾಜಿಸುವೆ. ಅಂಥಹ ನೀನು ನನ್ನಂಥಹವನಿಗೆ ಪ್ರಸನ್ನಳಾಗಿ ನಿರುಪಮಾನ ಮೇಧಾಶಕ್ತಿಯನ್ನು ಕರುಣಿಸು.
continued tomorrow


Comments
Post a Comment