ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿಶತಕಂ
ಸ್ತುತಿ ಕರ್ತಾ
ಅಭಿನವ ಕಾಳಿದಾಸಃ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರೀ
ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಾತಾ : ಶ್ರೀ ಕೇ ಯನ್ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸಂಸ್ಕೃತ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಕೇಂದ್ರೀಯ ಪಾಠಶಾಲಾ ,
ಮಲ್ಲೇಶ್ವರಂ ,ಬೆಂಗಳೂರು
@@@@@@@@@@
ಅಪರಾಧ ಶತ ಸಮಾಕುಲ
ಮಪಥ -ಗತಂತಾವಕಸ್ತ್ವೇನರತಂ !
ಕೃಪಯಾ ಮಮ ಹೃದಯಂತೇ
ಸಪದಿ ಸಕೃತ್ಪದನ್ನಯ ಬ್ರಾಹ್ಮೀ || 66
ಅಮ್ಮಾ ! ನೂರಾರು ಅಪರಾಧಗಳನ್ನು ಎಸಗಿದ್ದೇನೆ. ಕೆಟ್ಟದಾರಿ ಹೊಕ್ಕಿದ್ದೇನೆ. ಓ ಬ್ರಾಹ್ಮಿ! ಅಂಥಹ ನನ್ನನ್ನು ಕರುಣೆಯಿಂದ ನಿನ್ನ ಪಾದಾರವಿಂದದಲ್ಲಿರುವ ಹಾಗೆ ಅನುಗ್ರಹಿಸು. ನಿನ್ನನ್ನು ಯಾವಾಗಲೂ ಸ್ತುತಿಸುವೆ.
ಆಹಿತ ಜಗದಾಲೋಕಾ
ಲೋಹಿತ ದೃಗ್ದಲಿತ ಭಕ್ತ ಜನಶೋಕಾ !
ಈಹಿತಕರೀತ್ವಮೇಕಾ
ಪಾಹಿತ್ವಂ ವಾಣೀ ! ನಮ್ರ ರಿಪುಲೋಕಾ || 67
ಓ ವಾಣಿ! ನೀನು ಜಗತ್ತನ್ನು ನೋಡುವುದೇ ಮಹಿಮೆ. ನೀನು ದೃಷ್ಟಿಸಿ ನೋಡಿದರೆ ಸಾಕು ಭಕ್ತಜನರ ಶೋಕ ಪರಿಹರಿಸುವುದು; ಕೋರಿಕೆಗಳು ಈಡೇರುವುವು;ಶತ್ರುಗಳು ಎತ್ತಲಾರರು. ಅಂಥಹ ನೀನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡು.
ಲೋಕೇಶ ಭಾಗಧೇಯಂ
ಯೇಕೇ ಚಿತ್ವಾ ಮುಪಾಸತೇ ತೇ Z ಸ್ಮಿನ್ !
ಲೋಕೇ ಸಫಲತರಾರ್ಥಾ
ನಾಕೇಶಪದಾಯ ಶಕ್ನುವನ್ಯಂಬ || 68
ಓ ಅಂಬೆ! ಲೋಕೇಶ್ವರನಾದ ಬ್ರಹ್ಮನ ಭಾಗ್ಯರಾಶಿ ನೀನು. ಪುಣ್ಯ ಮಾಡಿರುವವರೇ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸಲು ಸಾಧ್ಯ. ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸಿದವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲ ಕೋರಿಕೆಗಳ ಫಲವನ್ನು ಪಡೆಯುವದಷ್ಟೇ ಅಲ್ಲ
ಸ್ವರ್ಗಲೋಕದಲ್ಲಿನ ವಾಸದ ಭಾಗ್ಯ ಹಾಗೂ ಸ್ವರ್ಗಾಧಿಪತ್ಯವನ್ನೂ ಸಹ ಹೊಂದುವರು.
ವಂದಾರು ಸುಲಭತರಯಾ
ಮಂದಾರಾರಾಮ ಮಧ್ಯತಲಗತಯಾ !
ಕುಂದಾವದಾತಯಾಹಂ
ನಂದಾಮಿ ವಿರಿಂಚಿಜಾಯಯಾಪರಯಾ || 69
ಅಮ್ಮಾ ! ನೀನು ಸ್ತುತಿಸುವವರಿಗೆ ಸುಲಭವಾಗಿ ಕಾಣುವೆ. ದಿವ್ಯ ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ನಿನ್ನ ವಿಗ್ರಹ ವಿರಾಜಿಸುತ್ತಿದೆ. ಕುಂದಪುಷ್ಪದಂತೆ ಬಿಳಿಯಿರುವ ಬ್ರಹ್ಮನ ಪತ್ನಿಯಾದ ನಿನ್ನನ್ನು ಯಾವಾಗಲೂ ಸಂತೋಷದಿಂದ ಭಜಿಸುವೆ.
ಶಿವದೃಷ್ಟಿ ವೃಷ್ಟಿ ಪಾತ
ಸ್ತವ ಯಸ್ಮಿನ್ ಪತತಿ ಮಾನವೇ ಮಾತಃ !
ಭವತಿ ಸಧನ್ಯೋ ಭಾರತಿ
ಕವಯಿತು ಮನುಜಾಗ್ರಣಿರ್ಬುಧೈರ್ಮಾನ್ಯಃ || 70
ಓ ತಾಯಿ! ನಿನ್ನ ಮಂಗಳಕರವಾದ ನೋಟ ಯಾವ ಅದೃಷ್ಟವಂತನ ಮೇಲೆ ಹರಿಯುವುದೋ ಅವನು ಜೀವನದಲ್ಲಿ ಧನ್ಯನಾಗುವನು. ಓ ಭಾರತಿ! ಅಷ್ಟೇ ಅಲ್ಲ , ಲೋಕದಲ್ಲಿನ ಕವಿಗಳಲ್ಲಿ ಅಗ್ರಗಣ್ಯನಾಗುವನು. ವಿದ್ವಜ್ಜನರಲ್ಲಿ ಮಾನ್ಯನು ಸಹ ಆಗುವನು.
@@@@@@@@@@@@
మహాకవి శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి ప్రణీతం
శ్రీ శారదా స్తుతి శతకం
శరత్కౌముదీ ఇత్యాఖ్యయా తెలుగు వ్యాఖ్యయా సమేతం
తెలుగు వ్యాఖ్యాతా :
డా !! ఆయాచితం నటేశ్వరశర్మా
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః
************
మపథ -గతంతావకస్త్వేనరతం !
కృపయా మమ హృదయంతే
సపది సకృత్పదన్నయ బ్రాహ్మీ !! 66
అమ్మా! నేను వందలకొలది అపరాధాలు చేశాను.చెడుదారిలో ప్రయాణించాను.అటువంటి నన్ను కరుణించి,నీ పాదారవింద సన్నిధిలో వసించే విధంగా అనుగ్రహించు.నేను ఎల్లప్పుడు నిన్ను స్తుతిస్తూనే ఉంటాను.
ఆహిత జగదాలోకా
లోహిత దృగ్దలిత భక్త జనశోకా !
ఈహితకరీత్వమేకా
పాహిత్వం వాణీ ! నమ్ర రిపులోకా !! 67
నీవు సమస్త జగత్తును దర్శింపగల మహిమాన్వితవు.కొసకంటి చూపుతోనే భక్త జనుల శోకాలను పోగొడుతావు.మా వరాలను నీవే తీర్చ గలవు.అటువంటి నీవు నన్ను కాపాడు.నీకు శత్రువులందరూ నీ పాదాక్రాంతులౌతారు.
లోకేశ భాగధేయం
యేకే చిత్వా ముపాసతే తే Z స్మిన్ !
లోకే సఫలతరార్థా
నాకేశపదాయ శక్నువన్యంబ !! 68
లోకేశ్వరుడైన బ్రహ్మదేవుని భాగ్యరాశివైన నిన్ను ఎంతో పుణ్యం చేసుకొన్నవారే స్తుతించగలరు.నీ స్తోత్రం చేసిన వారికి ఇహలోకంలో అన్నికోరికలూ తీరడమే గాక,స్వర్గ లోక నివాస భగ్యం,స్వర్గాధిపత్యం కూడా లభిస్తుంది.
వందారు సులభతరయా
మందారారామ మధ్యతలగతయా !
కుందావదాతయాహం
నందామి విరించిజాయయాపరయా !! 69
అమ్మా! నీవు స్తుతించేవారికి సులభంగా కనబడుతావు.దివ్యదేవాలయాలలో నీ విగ్రహం విరజిల్లుతోంది.కుంద పుష్పంవలె మృదువై తెల్లగా ఉండే నిన్ను నిరంతరం మ్రొక్కుతాను.
శివదృష్టి వృష్టి పాత
స్తవ యస్మిన్ పతతి మానవే మాతః !
భవతి సధన్యో భారతి
కవయితు మనుజాగ్రణిర్బుధైర్మాన్యః !! 70
ఓ తల్లీ! నీమంగళకరమైన చూపు ఏ అదృష్టవంతునిపై ప్రసరిస్తుందో వాడు ధన్య జీవనుడౌతాడు.అంతేగాక లోకంలోని కవులలో అగ్రగణ్యుడౌతాడు.విద్వాంసుల మన్ననలను అందుకొంటాడు.


Comments
Post a Comment