శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర కృతిసమర్పణము  -(10-05-17)
 అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి
             
తన సుప్రభాతము చదివితే కలిగే  ఫలశ్రుతిని  ఈశ్లోకములో కవి వివరిస్తున్నారు.

ఫలశ్రుతిః

భుజంగ ప్రయాత వృత్తము

ఇదం సుప్రభాతం పఠేయుర్నరాయే
మహేశైక చిత్తఃప్రభాతే౽ప్రమత్తాః !
సమస్తార్థభాజో౽త్రతేసత్యయుక్తాః
పరంధామశైవంసుఖంసంవ్రజేయుః !! 24

తాత్పర్యము

ఈ శివస్వామి సేవ కొరకు నేను రచించిన ఈ సుప్రభాతమును  శివునియందు  మాత్రమే మనస్సు కలిగినవారై   సావధానులై  తెల్లవారు సమయములో  ఏ మానవులు చదువుతారో,వారు ఈ లోకములో  సమస్తమైన  ప్రయోజనములు పొంది, సత్యముతో కూడిన వారవుతారు. మోక్షాన్ని, శివ సంబంధమైన , శుభంకరమైన సుఖాన్ని పొందగలరు.

విశేషాలు

1.      ఏదైనా ఒక స్తోత్రం రచించినప్పుడు ఫలానా ఫలితం కలుగుతుందని చెప్పే విధానాన్ని ఫలశ్రుతి అంటారు.
2.      "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (శుభోదయం ) అని అర్ధం. స్వామికి చేయు  అనేకమైన సేవల సేవలలో ఒకటి  సుప్రభాత సేవ.
3.      తెల్లవాఱుటకు ముందు నాలుగు గడియలు గల కాలమును ప్రభాతము అంటారు..

Comments

Popular Posts