శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (27-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
త్రిగుణాయ త్రిరూపాయ త్రినేత్రాయ త్రిశూలినే !
పాపాటవీకుఠారాయ శ్రీమహేశాయ మఙ్గళం !! 7
తాత్పర్యము
సత్త్వము, రజస్సు, తమస్సుఅను మూడు గుణములు కలవానికి, స్థూలము, సూక్ష్మము, పరము అను మూడు రూపములు కలవానికి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను మూడు కన్నులు కలవానికి(భూత, భవిష్యత్, వర్తమానాలను సూచించే మూడు కన్నులు కలవానికి), ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులను( మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులను, ఇడా పింగళ సుషుమ్నా నాడులను) సూచించే మూడు మొనల శూలమును ధరించినవానికి, పాపమను అడవిని నరికే గొడ్డలివంటి వానికి ,మహేశునికి శుభము పాడుచున్నాను
Comments
Post a Comment