శ్రీ ఉమామహేశ్వర స్మృతిః  (శ్రీ ఉమామహేశ్వరుల తలపు). 
(31-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
                       
భుజంగప్రయాతము

శివం శైలజా విభ్రమభ్రాంత చిత్తం
నటంతం చలన్మౌళిశీతాంశురేఖం!
నటఛ్చృఙ్గి భృఙ్గ్యాదిభిస్సేవ్యమానం
మనశ్చిత్స్వరూపంస్మరోమామహేశం !! 001

తాత్పర్యము

శుభాన్ని , సుఖాన్ని ఇచ్చేవానిని, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి  విలాసములందు భ్రమించు  మనస్సు  కలవానిని(అనగా పార్వతీదేవి విలాసములు శివుడిని ఆకర్షించాయని భావం)తాండవ నృత్యము చేయు సమయములో  చలించుచున్న సిగపైని చంద్రరేఖ కలవానినిశృంగి, భృంగి మొదలగు వారిచే సేవింపబడుచున్నవానిని,జ్ఞాన స్వరూపుని,(మనస్సు,ప్రాణశక్తి) స్వరూపుని మహేశుని స్మరింపుము.
విశేషాలు
1.      ఒక విషయం అర్థం కాకపూర్వం , అర్థం అయిన తర్వాత ఉండే స్థితులకు మధ్య తేడా,మెలకువ రాక పూర్వం మెలకువ వచ్చిన తర్వాత ఉండే  స్థితులకు మధ్య తేడాను         చిత్  అంటారు.
2.      “చిత్” అంటే జ్ఞానం.  ప్రతిపదార్ధం వెనుక ఆ పదార్ధానికి సంబంధించిన తత్త్వాన్ని  జ్ఞానమంటారు. తత్త్వం          లేకుండా                 పదార్ధం వుండదు. వృక్షం లోని  వృక్షత్వమే దానియొక్క జ్ఞానము. ఇదే  చిత్ అని      పిలువబడుతుంది.
3.      అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్ (ఆనందమ్) బ్రహ్మ రూపము.నామము, రూపము- జగద్రూపము
4.      లలితా సహస్ర నామాలలో  అమ్మవారి పేరు  “చిత్’ గా చెప్పబడింది.ఈ శ్లోకంలో తెలకపల్లి వారు  ఉమతో కలిసిన మహేశుని మనశ్చిత్స్వరూపంగా వర్ణించుట విశేషం.
5.      శృంగి, భృంగి మొదలయినవారు శివుని ప్రమథ గణాలలోని వారు.( శివుని అనుగ్రహమువలన కైలాసమున అతనితోకూడ ఉండు భక్తుల సమూహమును ప్రమథ గణమంటారు)  భృంగి వాహనంపై  బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికీ శ్రీ శైల మల్లన్నని ఊరేగించటం ఆచారం.
6.      భృంగిని గురించి ఆసక్తి కరమైన కథనం లోకంలో ప్రచారంలో ఉంది.
7.      భృంగి శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడట.. ఇలా రోజూ చేస్తుండటంతో  శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట. భృంగి తేనెటీగలా మారిపోయి పరమ శివుడికి, అమ్మవారికీ మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట.
8.      భృంగి భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాననీ, ఇవ్వకూడదని అమ్మవారూఇరువురూ తగాదా పడ్డారని అరుణాచలంలో  అర్చకులు అత్యంత వైభవంగా ఇప్పటికి ఆది దంపతుల ప్రణయ కలహోత్సవం చేస్తారు.

Comments

Popular Posts