శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమామహేశ్వర స్మృతిః
(శ్రీ ఉమామహేశ్వరుల తలపు). (01-06-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
జగద్యోనిమాద్యం జ్వలన్నాగభూషం
జటాజూటసంశోభి గఙ్గా ప్రవాహం!
అళిభ్రాంతి కృద్భవ్య రుద్రాక్ష మాలం
మనశ్చిత్స్వ రూపం స్మరోమామహేశం !!002
తాత్పర్యము
ప్రపంచ సృష్టికి మొదటి కారణమైనవానిని, ప్రకాశించునట్టి పాములు భూషణములుగా కలవానిని,జడముడుల సమూహమందు ప్రకాశించు గంగా ప్రవాహము కలవానిని,తుమ్మెదల భ్రాంతిని కలిగించు గొప్పదైన రుద్రాక్ష మాలలు కలవానినిజ్ఞాన స్వరూపుని మహేశుని స్మరింపుము.
1. శివభక్తులు ధరించెడి ఒకానొక కాయ రుద్రాక్ష.
2. త్రిపురాసురుని కొఱకు రుద్రుడు దేవస్వరూపిణి అగు గాయత్రిని బాణముగా చేసి కన్నులు మూసికొని ధ్యానము చేసే సమయంలో అతని కనురెప్పలనుండి పడిన జలబిందువులచే రుద్రాక్షము పుట్టినట్లు చెబుతారు.
3. రుద్రాక్ష అనేక భేదములు కలిగి ఉంటుంది. దీనిధరించుట మహా మోక్షసాధకము అని స్మార్తులు, శైవులును విశ్వాసముతో ధరింతురు.
4. రుద్రాక్షకి సాధారణంగా ఒకటి నుంచి పదహారు ముఖాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ ముఖాలవి కూడా ఉండవచ్చు. ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలే లభిస్తుంటాయి.
5. నేపాల్ దేశంలోనూ, బీహార్ ఉత్తర ప్రాంతంలోనూ రుద్రాక్ష చెట్లు ఉంటాయి. దక్షిణ దేశంలోనూ ఇరవై ఒకటవ శతాబ్దంలో రుద్రాక్ష చెట్ల పెంపకం జరుగుతున్నది.
6. రుద్రాక్ష మాలలు శివ సంబంధమైన జపాలకు శ్రేష్ఠం అంటారు. రుద్రాక్షలకు ఓషధీ లక్షణాలు ఉన్నాయని ఆధునిక పరిశోధకులు సైతం అంటున్నారు.
7. ఏక ముఖి రుద్రాక్షలకు విలువ ఎక్కువ. రుద్రాక్షపరిమాణాన్ని బట్టి రెండు వరుసలుగానో, ఒక వరుసగానో రుద్రాక్ష మాలలు వేసుకొంటారు. ముంజేతులకు, బాహుదండాలకు, మెడలోనూ, శిరస్సువిూద రుద్రాక్ష మాలలు ధరించే సంప్రదాయం ఉంది
8. రుద్రాక్ష విూద నిలువు గీతలు ఉంటాయి. రెండు గీతల మధ్య ఉండే చోటు ముఖం.
9. రుద్రాక్షను తుమ్మెదతో పోల్చిన తెలకపల్లి వారి భావన అసాధారణమైనది.
Comments
Post a Comment