ಶ್ರೀ ಶಾರದಾ ಸ್ತುತಿಶತಕಂ

ಸ್ತುತಿ ಕರ್ತಾ
ಅಭಿನವ ಕಾಳಿದಾಸಃ ಶ್ರೀ ತೆಲ್ಕಪಲ್ಲಿ ರಾಮಚಂದ್ರ ಶಾಸ್ತ್ರೀ
ಕನ್ನಡ ವ್ಯಾಖ್ಯಾತಾ :
ಶ್ರೀ ಕೇ.ಯನ್ .ಸೂರ್ಯನಾರಾಯಣ 

@*******************************@********************************@

ವಿದ್ಯೋದಯಲವಶೂನ್ಯೋ
ಪ್ಯಾದ್ಯೋಕ್ತಿಚರೀಯಇಡತೇಭವತೀಂ !
ಪ್ರದ್ಯೋತನಸಮತೇಜಾ
ಸ್ಸದ್ಯೋಲಭತೇ ಸ ಶಾರದೇಸ್ವರ್ಗಂ || 86

ಓ ಶಾರದೆ! ಅಕ್ಷರತಿಳಿಯದ ಮೂಢ ನಿನ್ನ ಕೃಪೆಗೆ ಪಾತ್ರನಾದರೆ, ನಿನ್ನ ತೇಜಸ್ಸನ್ನು ಪಡೆಯುವನು. ಓ ಶೃಂಗಗಿರಿ ಮಾತೆ! ನಿನ್ನ ಕೃಪೆ ಇದ್ದರೆ ಎಂಥವನೂ ಕ್ಷಣಮಾತ್ರದಲ್ಲಿ ಸ್ವರ್ಗಪಡೆಯುವನು.

ಕುಂಡಲಿತಾಮಣಿಖಂಡೈಃ
ಚಂಡಮರೀಚಿಪ್ರಭಾವಿರೋಧಕರೈಃ !
ಮಂಡಯತಾತ್ಸ್ವಾಂತಮ್ಮೇ
ಮಂಡಲಿತಾಶಾರದಾಶೃತಿಸ್ತ್ರೀಮಿಃ ||87

ಓ ತಾಯಿ ಶಾರದೆ! ಈ ನಿನ್ನ ರೂಪ ಉಜ್ವಲ ಮಣಿಗಳಿಂದ (ಮೂರು ಮಂತ್ರಗಳ ಕೂಟಗಳಿಂದ) ಕೂಡಿದೆ. (ಕುಂಡಲಿನೀ ಶಕ್ತಿಯಿಂದ ಕೂಡಿದೆ). ಆ ನಿನ್ನ ಮಂತ್ರಮಯಿರೂಪ ಚಂದ್ರನ ಕಿರಣಗಳನ್ನೂ ಮೀರಿ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದೆ. ನೀನು ಮೂರು(ಋಗ್,ಯಜುರ್ ಹಾಗೂ ಸಾಮ) ವೇದಗಳನ್ನುಧರಿಸಿ ಶೋಭಿಸುತ್ತಿರುವೆ. ಅಂಥಹ ಹೇ ಶಾರದೆ! ನೀನು ನನ್ನ ಹೃದಯ- ಮಂಡಲದಲ್ಲಿ ಮಂಡಿಸು.

ಪಾಪಾಟವೀ ದವಾನಲ
ರುಪಾಯಿತಮಂಬರೇ ರಜಃ ಪದಯೋಃ !
ಭೂಶಾಯಿತಮಮರ ಮೂರ್ಧಸು
ಗೋಪಾಯತು ಶಾರದೇ ! ಕುಟುಮ್ಬಮ್ಮೇ || 88

ಓ ಶಾರದೆ! ನಿನ್ನ ಪಾದಧೂಳಿ ಪಾಪವೆಂಬ ಕಾಡಿನಲ್ಲಿ ಉಂಟಾಗುವ ಕಾಡ್ಗಿಚ್ಚು( ಪಾಪಗಳನ್ನು ಸುಡುವ ಬೆಂಕಿಯ ರೂಪ). ನಿನ್ನ ಪಾದದ ರಜಸ್ಸು ದೇವತೆಗಳ ಕಿರೀಟಕ್ಕೆ ಮೆರಗು. ಅಂಥಹ ನಿನ್ನ ಪಾದರೇಣು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ರಕ್ಷಿಸಲಿ.

ಧೀಕನ್ಯಕಾಮ್ಮಮೇಮಾಂ
ಧೀರೋಮುಗ್ಧಾಂಕಟಾಕ್ಷ ತನಯಸ್ತೇ !
ಪರಮ ಸುಖ ವಿತರಣ ನಿಪುಣಃ
ಪರಿಣೀಯ ಚಿರಾಯ ಶಾರದೇ ! ರಮತಾಂ || 89

ಓ ತಾಯಿ ಶಾರದೆ! ನನ್ನ ಬುದ್ಧಿ ಕನ್ಯೆಯೊಬ್ಬಳಂತೆ. ಆಕೆ ನವಯೌವನವತಿ. ಧೀರನಾದ ನಿನ್ನ ಈ ಪುತ್ರ ಪರಿಣಯಿಸಿ ಚಿರಕಾಲ ಪರಮಸುಖವನ್ನು ನಿಪುಣತೆಯಿಂದ ಆನಂದಿಸಲಿದ್ದಾನೆ. ಹೇ ಶಾರದೆ! ನೀನು ನಿನ್ನ ಈ ಧೀಕನ್ಯೆಗೆ ಹಾಗೂ ಈ ನಿನ್ನ ಪುತ್ರನಿಗೆ ಕ್ಷೇಮ, ಸುಖ ಮತ್ತು ಆನಂದವನ್ನು ದಯಪಾಲಿಸು.

ಅಧರೀಕೃತ ಮಧುರ ಸುಧಾ
ವಿಧವಚನ ಭ್ರಮತಿ ನಾಭಿ ಜನ್ಮಮತೇ !
ಬುಧ ಜೀವನೌಷಧಂತೇ
ಸಧನಮ್ಮಾಂ ಶಾರದೇ ಪದಂಕುರ್ಯಾತ್ || 90

ಓ ತಾಯಿ ಬ್ರಹ್ಮನ ಮತಿಯೇ ! ಶಾರದೆ! ನಿನ್ನ ಅಧರದಿಂದ ಹೊರ ಹೊರಟ ಮೃದು ಮಾತು ಅಮೃತವನ್ನೂ ಮೀರಿದ ಮಧುರಮಾಯೆ. ಆ ಮಾತು ವಿದ್ವಜ್ಜನರ ಪಾಲಿಗೆ ಔಷಧ. ಅಮ್ಮಾ ! ಅಂಥಹ ನಿನ್ನ ಮಾತುಗಳು ನನ್ನನ್ನು ಧನವಂತನನ್ನಾಗಿ ಮಾಡಲಿ.

@@@@@@@@@*******************@@@@@@@@@

శ్రీ శారదా స్తుతి శతకం 

స్తుతి కర్తా :
అభినవ కాళిదాసః
శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రీ

తెలుగు వ్యాఖ్యాతా :

డా !! ఆయాచితం నటేశ్వరశర్మా 
విశ్రాంత ప్రాంశుపాలః,ప్రాచ్య విద్యాపరిషత్ ప్రాచ్య కళాశాలా,కామారెడ్డి 
విశ్రాంత ప్రాచ్యభాషాపీఠాధిపతిః,ఉస్మానియా విశ్వ విద్యాలయః

@@@@@@@@@*******************@@@@@@@@@


విద్యోదయలవశూన్యో
ప్యాద్యోక్తిచరీయఇడతేభవతీం !
ప్రద్యోతనసమతేజా
స్సద్యోలభతే స శారదేస్వర్గం !! 86

అక్షరాలు తెలియని మూఢుడుసైతం నీ కరుణకు పాత్రుడైతే,గొప్ప జ్ఞనవంతుడై ప్రౌఢ వచనుడౌతాడు.నీదయ ఉంటే చాలు ఎవనికైనా క్షణంలో స్వర్గం లభిస్తుంది.

కుండలితామణిఖండైః
చండమరీచిప్రభావిరోధకరైః !
మండయతాత్స్వాంతమ్మే
మండలితాశారదాశృతిస్త్రీమిః !!87

ఓతల్లీ! నీ రూపం ఉజ్జ్వల(మంత్ర మణులతో(కుండలితం)వలయితం(కుండలినీశక్తిసమన్వితం)అవుతూ,చంద్రుని కిరణాలనుసైతం విరోధిస్తోంది.(చంద్రుని కాంతిని మించి పోయింది).అటువంటి నీవు శ్రుతులు (వేదాలు) అనే స్త్రీలతో మండితురాలవై(పరివేష్టింపబడినదానవై) నా హృదయాన్ని ప్రకాశింప జేయు తల్లీ!

పాపాటవీ దవానల
రుపాయితమంబరే రజః పదయోః !
భూశాయితమమర మూర్ధసు
గోపాయతు శారదే ! కుటుమ్బమ్మే !! 88

ఓ శారదా ! నీ పాద ధూళి పాపాలు అనే అడవులలో రేగిన కార్చిచ్చువంటిది(పాపాలను కాల్చివేసే అగ్ని రూపమైంది).నీపాద రజస్సు దేవతల కిరీటాలకు చక్కని అలంకారం.అటువంటి నీ పాదరేణువు నాకుటుంబాన్ని రక్షించుగాక .

ధీకన్యకామ్మమేమాం
ధీరోముగ్ధాంకటాక్ష తనయస్తే !
పరమ సుఖ వితరణ నిపుణః
పరిణీయ చిరాయ శారదే ! రమతాం !! 89

ఓ శారదా ! నా బుద్ధి ఒక కన్యవంటిది .అది నవయౌవనవతి.దానిని ధీరుడైన నీపుత్రుడు పరిణయమాడి చిరకాలం అనందించుగాక. నీపుత్రుడు నా ధీకన్యకకు క్షేమాన్నీ,సౌఖ్యాన్నీ ప్రసాదించగలడు.

అధరీకృత మధుర సుధా
విధవచన భ్రమతి నాభి జన్మమతే !
బుధ జీవనౌషధంతే
సధనమ్మాం శారదే పదంకుర్యాత్ !! 90

ఓ తల్లీ ! నీమృదువచనాలు సుధారసాలను(అమృతరసాలను)మించిన మధురమయాలు.అవి విద్వాంసులపాలిట జీవనౌషధాలు. అలాంటి నీపలుకులు నన్ను ధనవంతుణ్ణి చేయుగాక!

Comments

Popular Posts