1. శ్రీ అయ్యప్ప స్వామి నిత్యుడు ,సత్యస్వరూపుడు . సకలజగత్తుకే ఆరాధ్యుడు.శ్రేష్టుడు,పూజ్యుడు.యెల్లప్పుడూ తననామాన్నే తలచే సమస్త భక్తులను ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తాడు.ఆస్వామి సనాతనుడు.హృదయంలో కొలువై ఉంటాడు.నిరంతరం ఆనందంలో మునిగి తేలే సమస్త దేవతల చేత పూజింప బడుతాడు.అట్టి శబర గిరీశుడూ ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ తలుస్తూ ఉంటాను.    
                                                                            

2. శ్రీ అయ్యప్ప స్వామి యెల్లవేళలా తుమ్మెదల వంటి ముని గణాలతో ఆడుకొంటుంటాడు.అతడు విశ్వాన్ని రక్షించగల హరిహరుల పుత్రుడు..వేదాంతాలలోని పరమార్థాలను తెలిపే ఉత్తమ గ్రంథాలచేతనూ,వేదాల సారం తెలిసిన తెలిసిన పుణ్యాత్ములైన మహాత్ములచేతనూ అన్వేషింపబడే దేవదేవుడు.అట్టి శబరగిరీశుడూ,సద్గురువు అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడు భావిస్తూ ఉంటాను.    
                                                                                                                                            
3. ఆస్వామి యెన్నో మహిమలకు గని వంటి వాడు .అందరికీ అభయమిస్తాడు.మంగళాలను ప్రసాదిస్తాడు..దేవతలకు హృదయకమలమై వెలుగుతుంటాడు.పండ్రెండు  మంది సూర్యులతో  సమానమైన తేజస్సు గల వాడు.ధీరుడు .వీరుడు.దితి పుతృలైన రాక్షసులపాలిట ఆయుధం లాంటి వాడు. అట్టి శబర గిరీశుడూ ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ చింతిస్తూ ఉంటాను.                                                                                                       


4. ఆ స్వామి పంపానదీ తీరంలో యెల్లవేళలా స్వేఛ్ఛావిహారం చేస్తూ ఉంటాడు.కుమార స్వామి స్వరూపుడు.కరుణకు సముద్రం లాంటివాడు..కలిదోషాలను పోగొట్టే వాడు..కవులకు కల్పవృక్షం వంటి వాడు.ఆ స్వామి చూపులు కర్పూర పరాగం వలే చల్లగా అందరినీ కాపాడుతాయి. శబరగిరీశుడూ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ స్మరిస్తూనే ఉంటాను .

.
5. ఆస్వామి దివ్య కరుణా కటాక్షం ఈ నేలపై ఉన్న యెందరో అభాగ్యులను  రక్షిస్తుంది.అందరినీ వాత్సల్యంతో ధర్మ మార్గం వైపు నడిపిస్తుంది .ఆ స్వామి వ్యక్త రూపంలోనూ ,అవ్యకత రూపంలోనూ ఈ ప్రపంచంలో అంతటా సంచరిస్తూ ఉంటాడు.అటువంటి దేవదేవుణ్ణి నేను నమస్కరిస్తూన్నాను.శబరగిరీశుడూ,సద్గురువూ అయిన అయ్యప్పను నే యెల్లప్పుడూ కొలుస్తూ ఉంటాను.


6. విద్వత్కవి అయిన శ్రీ రామచంద్రుడు రచించిన అయ్యప్ప సద్గురు స్తోత్రం భక్తులకు ఆనందాని అందించు గావుత !.

telugu translation by Dr.Ayachitam Nateswara Sarma 




Comments

Popular Posts