శ్రీ మదయప్ప స్తుతిరత్న పంచకం
రచన :అభినవ కాళిదాస- తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రీ
తెలుగు తాత్పర్య రచన :డాక్టర్ .అయాచితం నటేశ్వర శర్మ
*********
సత్యం నిత్యం సకల జగదారాధ్య మార్యం వరేణ్యం
భక్తాన్సర్వాన్స్వపద నిరతాం స్తారయంతం భవాబ్ధిం !
ఆద్యం హృద్యం సకల విబుధైస్సేవ్యమానంద పూర్ణైః
అయప్పాఖ్యం శబరిగిరిశం సద్గురుం చింతయే z హం !! 1
శ్రీ అయ్యప్ప స్వామి నిత్యుడు ,సత్యస్వరూపుడు . సకలజగత్తుకే ఆరాధ్యుడు.శ్రేష్టుడు,పూజ్యుడు.యెల్లప్పుడూ తననామాన్నే తలచే సమస్త భక్తులను ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తాడు.ఆస్వామి సనాతనుడు.హృదయంలో కొలువై ఉంటాడు.నిరంతరం ఆనందంలో మునిగి తేలే సమస్త దేవతల చేత పూజింప బడుతాడు.అట్టి శబర గిరీశుడూ ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ తలుస్తూ ఉంటాను.
అశ్రాంతం సన్ముని గణ మనో భృంగ రాజైర్మిలిత్వా
ఖేలంతం శ్రీ హరి హర సుతం విశ్వరక్షా నిధానం !
శృత్యంతార్థ గ్రహణ చతురైర్మృగ్య మాణం కృతీంద్రైః
ఆయ్యప్పాఖ్యం శబరిగిరిశం సద్గురుం చింతయే z హం!! 2
శ్రీ అయ్యప్ప స్వామి యెల్లవేళలా తుమ్మెదల వంటి ముని గణాలతో ఆడుకొంటుంటాడు.అతడు విశ్వాన్ని రక్షించగల హరిహరుల పుత్రుడు..వేదాంతాలలోని పరమార్థాలను తెలిపే ఉత్తమ గ్రంథాలచేతనూ,వేదాల సారం తెలిసిన తెలిసిన పుణ్యాత్ములైన మహాత్ములచేతనూ అన్వేషింపబడే దేవదేవుడు.అట్టి శబరగిరీశుడూ,సద్గురువు అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడు భావిస్తూ ఉంటాను.
మాహాత్యానాం ఖనిమభయదం మంగళానామగారం
గీర్వాణాంచద్ధృదయ కమల ద్వాదశాత్మాయమానం !
ధీరం వీరం దితిసుత మనస్తీష్ణ శల్యాయితంతం
అయ్యప్పాఖ్యం శబరిగిరిశం సద్గురుం చింతయే z హం !! 3
ఆస్వామి యెన్నో మహిమలకు గని వంటి వాడు .అందరికీ అభయమిస్తాడు.మంగళాలను ప్రసాదిస్తాడు..దేవతలకు హృదయకమలమై వెలుగుతుంటాడు.పండ్రెండు మంది సూర్యులతో సమానమైన తేజస్సు గల వాడు.ధీరుడు .వీరుడు.దితి పుతృలైన రాక్షసులపాలిట ఆయుధం లాంటి వాడు. అట్టి శబర గిరీశుడూ ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ చింతిస్తూ ఉంటాను.
పంపాతీరే విహిత విహృతిం కార్తికేయ స్వరూపం
కారుణ్యాబ్ధిం కలిమల హరం కల్పవృక్షం కవీనాం !
కర్పూరాంచన్మద పరి హర చ్చీత దృక్పాత భాజం
అయ్యప్పాఖ్యం శబరగిరిశం సద్గురుం చింతయే z హం !! 4
ఆ స్వామి పంపానదీ తీరంలో యెల్లవేళలా స్వేఛ్ఛావిహారం చేస్తూ ఉంటాడు.కుమార స్వామి స్వరూపుడు.కరుణకు సముద్రం లాంటివాడు..కలిదోషాలను పోగొట్టే వాడు..కవులకు కల్పవృక్షం వంటి వాడు.ఆ స్వామి చూపులు కర్పూర పరాగం వలే చల్లగా అందరినీ కాపాడుతాయి. శబరగిరీశుడూ,సద్గురువూ అయిన అయ్యప్పను నేను యెల్లప్పుడూ స్మరిస్తూనే ఉంటాను .
మందాక్రాంతాం భువమల మిమాం యస్య భవ్యః కటాక్షో
ధర్మ్యాం గుణ్యాం రచయతి విభోర్భక్త వాత్సల్య పూర్ణం !
వ్యక్తావ్యక్తం జగతి సకలే సంచరంతం తమీశం
అయ్యప్పాఖ్యం శబరిగిరిశం సద్గురుం చింతయే z హం !! 5
ఆస్వామి దివ్య కరుణా కటాక్షం ఈ నేలపై ఉన్న యెందరో అభాగ్యులను రక్షిస్తుంది.అందరినీ వాత్సల్యంతో ధర్మ మార్గం వైపు నడిపిస్తుంది .ఆ స్వామి వ్యక్త రూపంలోనూ ,అవ్యకత రూపంలోనూ ఈ ప్రపంచంలో అంతటా సంచరిస్తూ ఉంటాడు.అటువంటి దేవదేవుణ్ణి నేను నమస్కరిస్తూన్నాను.శబరగిరీశుడూ,సద్గురువూ అయిన అయ్యప్పను నే యెల్లప్పుడూ కొలుస్తూ ఉంటాను.
కవికామనా
శబరగిరి శిఖర వసతే రయప్పాఖ్యస్య సద్గురో స్తోత్రం !
శ్రీ రామచంద్ర విద్వత్కవి రచితం భక్త హర్షదం భూయాత్ !!
విద్వత్కవి అయిన శ్రీ రామచంద్రుడు రచించిన అయ్యప్ప సద్గురు స్తోత్రం భక్తులకు ఆనందాని అందించు గావుత !.
This stotram has been digitalized and will be uploaded in you tube shortly.The stotram CD is produced by Sri Shivakumar Ramadgu & telkapalli rajasekhar sarma
Music : Keerthana studio,yousuf Guda,Hyderabad .
Singer :Mr.Pavan Kumar Umapathi .The CD will be released in Bhagyasree Function hall ,chatanya puri,Dilsukhnagar,Hyderabad on 27.11.2016 .Details will be intimated at the appropriate time.

Comments

Popular Posts