శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(27-04-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి

యక్షై రుపేత్యసకలైః కుశలీకుబేర 
శ్చంద్రప్రభాఖ్య నగరీ మిహ సిద్ధలక్ష్యాం ! 
నిర్మాప్యతే ౽ ర్చన కృతే ౽ స్త్యలకాం విహాయ 
శ్శ్రీమన్మహేశ్వర! విభో ! తవసుప్రభాతం! 12

తాత్పర్యము

ఓ పరమశివా !

సమస్త యక్షులచేత సేవింపబడువాడు, నేర్పరి అయినవాడు ఆ కుబేరుడు. అతడు తన అలకానగరాన్ని వీడి, నీపూజ కొరకు శ్రీ శైల క్షేత్రానికి ఉత్తరద్వారమయిన ఉమామహేశ్వరక్షేత్రంలో – సిద్ధులకు మాత్రమే కనిపించే చంద్రప్రభ అని పిలవబడే నగరాన్ని పరిపాలిస్తుంటాడు. సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు 8 కిలోమీటర్లున్న రంగాపూర్ గ్రామం నుంచి దక్షిణ దిశగా నాలుగు కిలో మీటర్లదూరంలోని 500 అడుగుల ఎత్తయిన పర్వత కనుమల మీద ఉమామహేశ్వరక్షేత్రం ఉన్నది.ఇది శ్రీ శైల క్షేత్రానికి ఉత్తరద్వారంగా చెబుతారు. ఈ ద్వారాన్ని కుబేరుడు రక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. ఇక్కడ ఆయన రాజధాని అయిన చంద్రప్రభా నగరం ఉన్నదని, ఇది సిద్ధులైన మహర్షులకు మాత్రమే కనిపిస్తుందని పెద్దలు చెబుతారు.

Comments

Popular Posts