శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(28-04-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి

సృష్టిస్థితి ప్రలయహేతు విభక్త భవ్య
మూర్తిత్రయ! త్రిపుర దైత్య దవాంబువాహ !
నిత్యానవద్య నిగమాంత విచార వేద్య
శ్రీమన్మహేశ్వర! విభో ! తవసుప్రభాతం!!13

తాత్పర్యము

సృష్టి , స్థితి, ప్రళయముల కొరకు బ్రహ్మ విష్ణు, మహేశ్వరులుగా విభజింపబడిన శుభమయిన మూడు మూర్తులు కలవాడా !
త్రిపురాసురులను కాఱుచిచ్చును ( అడవిలోనిదావాగ్నికి) చల్లార్చు మేఘములాంటివాడా!
ఎల్లప్పుడూ ఉండువాడా! దోషములేనివాడా ! వేదాంతములచే(ఉపనిషత్తులచే) విచారింపబడి తెలియదగినవాడా ! సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

త్రిపురాసురులు:
1. విద్యున్మాలి, 2. తారకాక్షుడు, 3. కమలాక్షుడు అను రాక్షసులు [వీరు తారకాసురుని కుమారులు]. వీరు గొప్ప తపస్సు చేసి శివుని అనుగ్రహమువలన ఇనుముతోను బంగారుతోను వెండితోను చేయబడిన మూడు కదిలేపట్టణములను పొంది లోకములను పాడుచేయుచు ఉండిరి. అప్పుడు విష్ణువు ఒక అవతారము ఎత్తి నారదుని తనకు శిష్యునిగా చేసికొని ఈ త్రిపురాసురులకును వీరి కాపులకును శివునియందలి భక్తి తొలగుటకు తగిన విషయములు బోధించాడు. అంత వీరును వీరి కాపులును శివద్వేషులు అయ్యారు. అందులకు శివుడు కోపించి వీరితో యుద్ధముచేసి వీరిని చంపెను. త్రిపురాసురులు తమ మరణానంతరము ప్రమథ గణములలో చేరారు.

Comments

Popular Posts