శ్రీ శివాయ గురవే నమః 

అభినవ కాళిదాస 

శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి 

శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం

తెలుగు భావ రచన:డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు.

భండసురాది ఖల దైత్య వినాశకర్తృ 
కాత్యాయినీ హృదయ చఞ్చల మంచశయ్య! 
నాగేంద్ర విస్తృత ఫణౌ మణి మణ్డితాఙ్గ  !
శ్రీమన్మహేశ్వర!విభో! తవ సుప్రభాతం !! 10 

భండాసురుడు మొదలైన దుష్ట  రాక్షసులను  నాశనము చేసినది పార్వతీదేవి.
ఆమె హృదయమను చంచలపు మంచమునకు  పానుపైన వాడా !
శ్రేష్ఠమయిన సర్పముల విశాలమైన పడగలయందు ప్రకాశించు
మణుల కాంతులచే అలంకరింపబడిన అవయవములు కలవాడా!
సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

చింతామణిగృహములో ( షట్చక్రాలలో శిరస్సులో ఉండే చక్రమైన సహస్రారములో ఉన్న       గృహము ) సర్వానందమయ చక్రము ఉంది.  దానిలో  బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులు  నాలుగు కోళ్ళుగా మోగుచున్న  గొప్ప మంచము ఉంది. , దీనినే శంకర భగవత్పాదులు   శివాకారే మంచే (08వశ్లో) అన్నారు సౌందర్యలహరిలో . పంచబ్రహ్మాసనస్థితా – (ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనము నందు ఉన్న తల్లికి నమస్కారము)అని లలితా సహస్ర నామాలలో చెప్పారు.

        ఈ మంచానికి  నాలుగు వైపులా నలుగురు (బ్రహ్మ, విష్ణు, రుద్ర ఈశానులు) కోళ్ళుగా      ఉంటే, పరమశివుడు ఆ       మంచము మీద పానుపుగా అన్నట్టు పడుకొని ఉంటాడు.

        నాలుగు కోళ్ల మంచం ఒక యోగ సంకేత భాష. కుండలినీ శక్తి సుషుమ్నద్వారా ఊర్ధ్వ గతిని పొందే సమయంలో      బ్రహ్మ ,        విష్ణు, రుద్ర, ఈశ్వర మొదలైన గ్రంథులు  మంచపుకోళ్లుగా చెబుతారు.  సహస్రార  కమలంలోని        సదాశివుడు       మంచం    యొక్క   తల్పముగా చెప్పబడ్డాడు.  . దీనినే శ్రీ  తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారు        మంచశయ్య అన్నారు.


Comments

Popular Posts