శ్రీ శివాయ గురవే నమః 
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి 
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(04-05-17)

అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి


తిన్నాహ్వయస్య శబరాన్వయజస్యలబ్ధ 
పుణ్యస్య సద్ధ్రుదయ సద్మని భక్తి దామ్నా !
బద్ధో౽ మృతం తవ నయః కరుణారసాబ్ధే !
శ్రీమన్మహేశ్వర! విభో! తవ సుప్రభాతం!!19

తాత్పర్యము

              పరమశివా ! ఆకులుకట్టుకొని అడవి యందుతిరిగే బోయకులానికి చెందిన తిన్నడను పేరు కలవాడు, తనకన్నును నీకు అర్పించి పుణ్యము పొంది కన్నప్పయ్యాడు , మంచి హృదయమను తన ఇంటిలో భక్తి అను హారముతో బద్ధుడై ధన్యుడయ్యాడు. ( హృదయ పూర్వకముగా శివుని తిన్నడు పూజించాడని భావం).నిన్ను పూజించువారికి అమృతత్వాన్ని కలిగిస్తావు. దయారసమునకు సముద్రమువంటివాడా !సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

               గాయక భక్తులైన అరవై మూడు మంది నయనారులలో ఒకనిగా భక్త కన్నప్ప శాశ్వత కీర్తి పొందాడు. తమిళ గ్రంధాలలో "కన్నప్ప నయనార్ లేదా నేత్రేశ నయనార్" గా ఈయనను పిలుస్తారు. శ్రీ కాళహస్తిలో చిన్న కొండ మీద , తిరువన్నామలై లోను కన్నప్పకి రెండు ఆలయాలు ఉన్నాయి.

Comments

Popular Posts