శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతము – కవికామన(కవి యొక్క కోరిక) (10-05-17)
 అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి
               
ఇదం శ్రీమహేశస్య సత్సుప్రభాతం
సతారామచంద్రేణ భక్త్యఞ్చితేన!
కృతం దక్షిణాస్యప్రసాదప్రభావా
త్ప్రభూయాత్ప్రపఞ్చేప్రకృష్టప్రసిద్ధై !25

తాత్పర్యము

    ఇది శ్రీ మహేశ్వరుని యొక్క  సత్ సుప్రభాతము. (=యథార్థమైన, ఘనమైన, మంచి, పావనమైన సుప్రభాతము)ఎప్పుడూ  భక్తితో కూడిన తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి  అను భక్తునితో దక్షిణామూర్తిఅయినశివునిఅనుగ్రహప్రభావమువలనఈసుప్రభాతము చేయబడినది(రచింపబడినది)చక్కటి ఖ్యాతిని  ఈ సుప్రభాతము ఈ ప్రపంచములో  పొందుగాక !
విశేషాలు

ఈ శ్లోకంలో శివుడిని - రామచంద్ర శాస్త్రి గారు దక్షిణాస్యుడని పిలిచారు.
 శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపము అంటారు. ఇదే  అఘోర ముఖం(ఇంకా వివరాలకు ఈ సుప్రభాతంలోని 11వశ్లోక విశేషాలు చూడవచ్చు).దక్షిణుడు అనగా సృష్టి స్థితి లయముల యందు నిపుణుడు అని అర్థము. శివుడిని దక్షిణా ౽ మూర్తయే అన్నపుడు ౽  అకారప్రశ్లేషచేత అమూర్తయే అని అర్థము వచ్చును. అమూర్తి యనగా మూర్తిలేని వాడు, నిర్వికారుడని అర్థం .

Comments

Popular Posts