శ్రీ శివాయ గురవే నమః 
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి 
ఉమామహేశ్వర స్తుతిః (14-05-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి 

ఘన సంసృతి తాపహరప్రవరా
మర భూరుహ!తే చరణౌ స్మరతాం!
పరమార్థ సుఖప్రద పాలయమాం
పరమేశ వరాభయ ముద్రకరా!003
తాత్పర్యము
గొప్పదైన ఈ సంసార తాపమును హరించు శ్రేష్ఠమైన దేవతా కల్పవృక్షమా ! నీ పాదములను సదా స్మరించుచుందును.
పరమార్థ(=ఆనందము;స్వర్గము;ధర్మచింత.)సుఖమును ప్రసాదించువాడా! 
పరమేశ్వరుడా ! శ్రేష్ఠమయిన అభయ ముద్ర కరము కలవాడా ! నన్ను పాలించి రక్షించుము.
విశేషాలు
అభయ ముద్ర
శివుడు నటరాజు రూపంలో ఉన్నప్పుడు కుడి పక్కన ఉన్న రెండో చేయి అభయ ముద్ర ద్వారా స్థితి, పాలనలను సూచిస్తుంది. ఎడమ ప్రక్కన ఉన్న రెండో చేయి పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుందని పెద్దలు చెబుతారు. తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారు “వరాభయ ముద్రకరా!”సంబోధనలో దీనిని సూచించారు.

Comments

Popular Posts