శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
ఉమామహేశ్వర స్తుతిః (15-05-17)
 అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
తోటకము
అచలంచల మాత్మభువం కుశలం
వితతం విశదం సుమనో విదితం!
హృదివాఞ్మనసా నవగమ్య మహం
కలయేగిరిశం మహసాం నిలయం!!004

తాత్పర్యము


          చలనములేనివానిని , చలించువానిని, తనకు తానే పుట్టినవానిని,   నేర్పరిని,వ్యాప్తి నొందినవానిని,  స్పష్టమైనవానిని, (తెల్లనివానిని), దేవతలకు, విద్వాంసులకు తెలియబడినవానిని,హృదయమునందు, వాక్కులందు మనస్సు చేత పొందదగినవానిని,కైలాసమునందు శయనించు పరమశివుని, తేజస్సులకు నిలయమైనవానిని  నేను ధ్యానించుచున్నాను .

విశేషాలు

              జ్యోతిషం, కల్పం అనే ఆరు వేదాంగాలు, న్యాయ, ధర్మ, విూమాంసా శాస్త్రాలు, అర్థ శాస్త్రం, పురాణం, ఆయుర్వేదం, ధనుర్వేదం అనే ఎనిమిది శాస్త్రాలు, విద్యలు కలసి పదునెనిమిదింటిని ‘‘వాక్’’ శబ్దం పరిధిలో చేర్చారు.ఇటువంటి “వాక్ “శబ్దాన్నిఈశ్లోకంలో  ప్రయోగించిన తెలకపల్లివారి ప్రతిభ  ప్రశంసనీయమైనది.

Comments

Popular Posts