శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (25-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి

శ్వేత ఛ్చత్రాయితా హీంద్ర ఫణాధస్స్ఫురదాత్మనే !
పరాత్పరాయ శాంతాయ 
శ్రీ మహేశాయ మఙ్గళం !!

తాత్పర్యము

    తెల్లని గొడుగుగా (చత్రముగా) సిద్ధమయిన ఆదిశేషుని పడగల క్రింద ప్రకాశించు రూపముకలవాని కొరకు , శ్రేష్ఠులకందఱికి శ్రేష్ఠుడైనవానికొరకు, చిత్తవిక్షేపం లేని, అంటే మనస్సు చెదరిపోవడం లేని వాని కొరకు , ఈశ్వరుని కొరకు శుభము పాడుచున్నాను.

విశేషాలు

   హంస ఈకలతో గాని, నెమలిఈకలతోగాని, చిలుక ఈకలతో గాని రాజుకు చత్రము పడుతుంటారు.(అగ్ని మహాపురాణము చామరాది లక్షణ కథనమను నలుబదియైదవ అధ్యాయము)తెలకపల్లి వారు ఈశ్లోకములోఆదిశేషుని పడగలు శివుడనే రాజునకు చత్రముగా ఉన్నాయనే అపూర్వ భావన చేసారు.

Comments

Popular Posts