శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (21-05-17)
 అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
                        01
శిరోభూషణ చంద్రాంశుసుధాధారార్ద్ర వర్ష్మణే !
తుహినాచల జామాత్రే శ్రీమహేశాయ మఙ్గళం !!
తాత్పర్యము
తలపై ఆభరణమయిన చంద్రుని   వెన్నెల అను అమృత ధారతో  తడిసిన మిక్కిలి చక్కని రూపము కలవాని కొరకు,మంచుకొండ అయిన హిమవంతుని అల్లుని కొరకు, శ్రేష్ఠుడైన ఈశ్వరుని కొరకు శుభము పాడుచున్నాను.
విశేషాలు
చల్లదనము కలిగించు పదాలను , సంబోధనలను ఈ మఙ్గళా శాసనంలో ప్రయోగించి తెలకపల్లి వారు తన సుప్రభాతము, స్తుతి  చదివే వారందరికి శివుడు జీవితాలలో చల్లదనము కలిగించాలని   వ్యంగ్యంగా కోరుతున్నారు.

Comments

Popular Posts