అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (22-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
2
సురాపగానటిరఙ్గ జ్జటామండలశోభినే !
నాగేంద్ర యజ్ఞ సూత్రాయ శ్రీమహేశాయ మఙ్గళం !!

తాత్పర్యము

దేవతల నది అయిన గంగానది అను నాట్యగత్తె ఆడుతుండగా మెరుస్తున్నజడలు కట్టిన వెండ్రుకల సమూహముతో ప్రకాశించువానికొరకు,వాసుకి అను సర్పరాజును జందెంగా కలవాని కొరకు ఈశ్వరుని కొరకు శుభము పాడుచున్నాను.

విశేషాలు

            యజ్ఞ సూత్రాయ యజ్ఞ సూత్రమనగా జందెం.వైదిక కర్మాచరణకు అర్హత కలిగిస్తుంది కనుక యజ్ఞ సూత్రం అన్నారు.వేదాధ్యయన యోగ్యత కలిగిస్తుంది గనుక బ్రహ్మసూత్రం. ఉపనయన సమయంలో అది బ్రహ్మసూత్రం. ఎడమ భుజము విూది నుంచి ఒక వైపు ఉదర భాగాన్ని, మరొక వైపు వీపును తగులుతూ కుడిచేతి క్రింద వ్రేలాడుతున్నప్పుడు అది ఉపవీతం. యజ్ఞసూత్రం ఇలా ఉన్నప్పుడు దేవతా కార్యాలన్నీ చేయవచ్చు. యజ్ఞ సూత్రం మెడలో హారంవలె వ్రేలాడు తున్నప్పుడు అది నివీతం. ఋషి తర్పణం, మలమూత్ర విసర్జనాదులలో యజ్ఞోపవీతం నివీతంగా ఉండాలని అంటారు.శివుడు, వినాయకుడు ఇద్దరూ పామును యజ్ఞోపవీతములుగా కలిగిన వారే.క్రూరమైన పాముయొక్క విష ప్రవృత్తిని నిగ్రహించి యజ్ఞసూత్రంలా చేసుకోవటమంటే దుస్సాధ్యమైన మనసును నిగ్రహించే సామర్ధ్యాన్ని పెంచుకొనే శక్తి శివుని వద్ద ఉన్నదని, దానికి సూచనగా నాగ యజ్ఞోపవీత ధారణ అని పెద్దలు చెబుతారు. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో యజ్ఞ సూత్రాయ ద్వారా కవి మనకు గుర్తు చేసారు.

Comments

Popular Posts