శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (23-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
3
లయకాలాంబుధిధ్వాన స్ఫర్ధి శంఖారవాయతే !
శూలినే మాలినే నాగై శ్శ్రీ మహేశాయ మఙ్గళం!!

      ప్రళయకాలములో సముద్రపు ధ్వనితో పోరాడే అనగా మంగళప్రదమైన శంఖరవము ఇప్పుడు వినబడుచున్నది. (శంఖధ్వని సముద్రపు ధ్వనిని నువ్వెంత అని సవాల్ చేసి తక్కువ చేస్తున్నదని , ప్రళయ కాలపు సముద్రపు ధ్వని కంటె శంఖ ధ్వని ఎక్కువ అని భావం).శూలమనెడి ఆయుధము కలవాని కొరకు ,పాములను మాలగా కలవానికొరకు,ఈశ్వరుని కొరకు శుభము పాడుచున్నాను.

విశేషాలు

                 ప్రళయమనగా సర్వప్రపంచ నాశము. ఇది 1.నిత్యప్రళయము, 2.నైమిత్తిక ప్రళయము, 3.ప్రాకృతి ప్రళయము, 4.ఆత్యంతిక ప్రళయము అని నాలుగువిధములు. ఇందులో నైమిత్తిక ప్రళయము చతుర్ముఖ బ్రహ్మయొక్క దినప్రళయము.సముద్రము ఉప్పొంగి లోకమంతయు జలమయము అవుతుంది. ముల్లోకములు అందులో అణగిపోతాయి. బ్రహ్మాండమయిన ఈ సముద్రపు ధ్వనిని కవి ఇక్కడ పేర్కొన్నారు.

Comments

Popular Posts