శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (24-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి

భూనభోంతర్విలింపత్స్వతేజః పుంజ వికాసినే !
శుద్ధ స్ఫటిక రూపాయ శ్రీమహేశాయ మఙ్గళం !!4

తాత్పర్యము

భూమి, ఆకాశము లోపల మధ్య బాగా పూత పూసిన తన తేజః సమూహములతో ప్రకాశించువానికొరకు (శివుని తేజస్సు అంతటా నిండి ఉన్నదని భావం)తెల్లని స్ఫటికము వంటి(= పటికపు రాయి) రూపము కలవానికొరకు ఈశ్వరుని కొరకు శుభము పాడుచున్నాను.
విశేషాలు
స్ఫటికము స్వచ్ఛతని, దోషరాహిత్యాన్ని సూచిస్తు౦ది. శివుని రంగు స్ఫాటిక శిలావర్ణం . స్ఫటికము నీళ్ళలో మునిగి ఉన్నప్పుడు అది ఉన్నదనికూడా తెలియదు. అందుచేత శివునకు రూపమున్నా రూపము లేనివాడుగా భావింపబడుతున్నాడు.అద్భుతమైన ఈ శివుని యొక్క అరూప భావనను కూడా శుద్ధ “స్ఫటిక రూపాయ” అను పదబంధముతో గుర్తు చేసిన తెలకపల్లివారి ప్రతిభ ప్రశంసనీయమైనది.

Comments

Popular Posts