శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (29-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
09
     ముముక్షు జనతా మోక్ష సౌధ నిశ్రేణయే ౽ స్తుతే !
  రజతాచల రత్నాయ శ్రీ మహేశాయ మఙ్గళం!!

తాత్పర్యము

ముముక్షుజనుల మోక్షమను సౌధమునకు నిచ్చెనవంటివానికి,(నిచ్చెనవలె సహాయపడువానికి) స్వయముగా ఎవరిని స్తుతింపక, అందరిచేత స్తుతింపబడువానికి, వెండికొండకు ( కైలాసము) రత్నము వంటి వానికి మహేశునికి శుభము పాడుచున్నాను.

విశేషాలు

1. ముముక్షువుకు మూడు అర్థాలు.
(అ)మోక్షం కోసం ప్రయత్నిస్తున్న సాధకుడు,(ఆ) యతి, (ఇ) నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమాదిషట్కము, ముముక్షత్వము అను సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు.
2. అస్తుతే
అస్తోతుః ప్రయోగము కాళిదాసు కుమార సంభవంలో శివుని పరంగా (06-83) ప్రయోగించారు. అభినవ కాళిదాసు శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారు ఈ మఙ్గళా శాసనంలో శివుని పరంగా ఇలా ప్రయోగించారు.

Comments

Popular Posts