శ్రీ శివాయ గురవే నమః 
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి 
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (28-05-17)
 అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి 

   మధురానగరీ మధ్య కదంబ వనభాసినే
మీనాక్షీ క్షణ బద్ధాయశ్రీమహేశాయ మఙ్గళం !!8

తాత్పర్యము


    మధురై నగరము మధ్యలో ఉన్న  కదంబవనములోఅమ్మవారితో ప్రకాశించువానికి, చేపలవంటి కన్నులు గల మీనాక్షీ దేవి యొక్క చూపులందు బంధింపబడిన మహేశునికి శుభము పాడుచున్నాను.

విశేషాలు

1. కులశేఖర పాండ్య మహారాజు-  దేవేంద్రుడు కట్టిన ఆలయాన్ని అభివృద్ధి చేసి ఒక నగరాన్ని నిర్మించాడు. దానికి “మధురానగరం” అని పేరు పెట్టారు. (ప్రస్తుతం తమిళనాడులోని మదురై పట్టణం) అతని కుమారుడు మలయధ్వజుడు పుత్రకామేష్టి యాగం చేయగా యఙ్ఞ కుండం నుంచి మూడేళ్ళ బాలికగా పుట్టింది. ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు. యుక్త వయసు రాగానే సుందరేశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ మధురానగరాన్ని తెలకపల్లి వారు ఈశ్లోకంలో  ప్రస్తావించారు.

2. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర –( కడిమి పూల గుచ్చములతో  అందముగా  ఉన్న కర్ణ  భాగము కలిగిన తల్లి)కదంబ కుసుమ ప్రియ -- కడిమి పువ్వులయందు ప్రేమ కలిగిన తల్లి)కదంబ వనవాసిని – (కడిమి చెట్ల యొక్క తోటలో నివసించు తల్లి ) అని లలితా సహస్ర నామములలో అమ్మవారికి పేర్లు .

3. కదంబముఅంటే సంస్కృతంలో నీప వృక్షం. కడిమిచెట్టుపువ్వులు   ఒకదానిలో నుండి  మఱొకటి వరుసగ దండలా  ఉంటాయి.సృష్టిలో ఐక్యతను కోరే తల్లి కి సంకేతంగా ఈ కదంబ నామము ప్రసిద్ధి .దీనిని గుర్తుచేసిన అభినవ కాళిదాసు బిరుదాంచితులకు నమః.


Comments

Popular Posts