అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమామహేశ్వర స్మృతిః  
(శ్రీ ఉమామహేశ్వరుల తలపు). (02-06-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
        
 కృపానౌకయా తారయంతంభవాబ్ధిం
సతోవిశ్వరూపం తపస్యాభిగమ్యం!
త్రినేత్రం త్రిశూలాయుధం నీలకంఠం
 మనశ్చిత్స్వరూపం స్మరోమా మహేశం!!03

తాత్పర్యము:

          దయ అను నౌకతో  ఈ సంసారము అను సముద్రమును దాటించువానిని,విశ్వరూపిగా అంతటా వ్యాపించి ఉన్నవానిని,  తపస్సుచేయువారికి  పొందదగినవానిని (తపస్సు ద్వారా శివుడు లభిస్తాడని భావం)సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను మూడు కన్నులు కలవానిని( లేదా భూత, భవిష్యత్, వర్తమానాలను సూచించే మూడు కన్నులు కలవానిని), ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులను( మానసిక  శారీరక, ఆధ్యాత్మికశక్తులను, ఇడా పింగళ సుషుమ్నా నాడులను) సూచించే మూడు మొనల శూలమును ధరించినవానిని,లోకముల రక్షణ కొరకు విషము తాగిన నల్లని మచ్చ కంఠమందు కలవానిని,జ్ఞాన స్వరూపుని  మహేశుని స్మరింపుము.

Comments

Popular Posts